Search warrant
-
అడ్వొకేట్ అరాచకం
విజయనగరం (క్రైమ్): నలుగురికీ న్యాయం చేయాల్సిన న్యాయవాదే భార్యను హింసకు గురిచేశాడు. 11 ఏళ్లపాటు భార్యను బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు. తమ కుమార్తె అసలు బతికి ఉందో లేదోనన్న సందేహంతో ఆమె తల్లిదండ్రులు విజయనగరం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఎం.దీపికను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులపైనా కేసు పెడతానంటూ న్యాయవాది బెదిరించడంతో చేసేది లేక మేజిస్ట్రేట్ జారీ చేసిన సెర్చ్ వారెంట్‌తో వెళ్లి గృహ నిర్బంధం నుంచి ఆమెను విడిపించారు. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలోని మార్వాడి వీధిలో ఉంటున్న న్యాయవాది గోదారి మధుసూదనరావు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన సాయిసుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్నాడు. 2009లో వీరికి పాప పుట్టింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సుప్రియ ఆ తరువాత భర్త దగ్గరకు వచ్చేందుకు నిరాకరించింది. నువ్వు లేకపోతే ఉండలేనంటూ భర్త చెప్పిన మాయమాటలు నమ్మి విజయనగరం వచ్చింది. అప్పటినుంచి భార్యను ఇంట్లోనే బంధించిన మధుసూదనరావు తల్లిదండ్రులతో మాట్లాడటానికి, చూడటానికి కూడా అనుమతించలేదు. ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమాలినా బయటినుంచే పంపించేసేవాడు. ఇలా 11 ఏళ్లపాటు ఈ తంతు సాగింది. దీంతో తమ కుమార్తె సుప్రియ అసలు బతికి ఉందో లేదోనని అనుమానించిన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతూ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా.. మీరు దొంగపోలీసులని, ఎఫ్ఐఆర్ ఉంటేనే రావాలని చెప్పి లోపలికి రానీయలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎస్పీ ఎం.దీపికను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు కోర్టునుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని బుధవారం ఆ ఇంటికి వెళ్లి మహిళను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. -
టెక్సాస్ షూటింగ్: ఆపిల్‌కు సెర్చ్ వారెంట్
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్సాస్ చర్చి కాల్పుల ఘటనలో ఐ ఫోన్‌మేకర్, టెక్ దిగ్గజం ఆపిల్ చిక్కుల్లో పడింది. 27మంది మృతికి కారణమైన ఈ ఘటనకు సంబంధించి ఆపిల్‌కు సెర్చ్‌వారెంట్ జారీ అయింది. నిందితుడి ఐ పోన్‌ను అన్‌లాక్ చేయడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు విఫలం కావడంతో విచారణ అధికారులు అతని డేటా కావాలంటూ ఆపిల్‌ను డిమాండ్ చేశారు. సదర్లాండ్ స్ప్రింగ్స్ విషాదానికి కారణమైన డెవిన్ పాట్రిక్ కెల్లీ (26) ఐ ఫోన్ ఎస్కి సంబంధించిన డేటా కావాలని ఆదేశించింది. శాన్ ఆంటోనియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం, టెక్సాస్ రేంజర్స్ ..కెల్లీ ఐఫోన్ ఎస్ఈలోని డేటా యాక్సెస్కోసం ఈ సెర్చ్ వారంట్ ఇచ్చింది. లోకల్, ఐ క్లౌడ్‌లోని సమాచారం కావాలని కోరింది. ముఖ్యంగా కాల్స్, మెసేజెస్, ఫోటోలు తదితర రికార్డులు సంపాదించేందుకు ఈ నోటీసులు జారి చేసింది. అయితే న్యాయపరమైన అంశం గనుక ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని ఆపిల్ ప్రతినిధి తెలిపారు. -
రక్షణ మంత్రి ఆశ్చర్యం
పణజి: తన అధికార నివాసంలో సోదాలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశాలివ్వడం తనకు ఆశ్చర్యం కలిగించిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న పారికర్ అధికారిక నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు గోవా ట్రయల్ కోర్టు ఏప్రిల్ 22న సెర్చ్ వారెంట్ జారీ చేసింది. అధికారిపై చేయి చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న గోవా మాజీ మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచేకో.. పారికర్ నివాసంలో తలదాచుకున్నారన్న సమాచారంతో కోర్టు ఈ ఆదేశాల్చింది. అయితే అదే రోజు సెర్చ్ వారెంట్ పై స్టే ఇచ్చింది. గోవా కోర్టు ఆదేశాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని పారికర్ అన్నారు. అంతకుముందు రోజే తాను అధికారిక నివాసంలోకి మారానని వెల్లడించారు. మిక్కీ పచేకోపై కేసు కోర్టులో ఉన్నందున ఏమీ మాట్లాడబోనని అన్నారు.