రక్షణ మంత్రి ఆశ్చర్యం | Was surprised by court order to search my residence, says Parrikar | Sakshi
Sakshi News home page

రక్షణ మంత్రి ఆశ్చర్యం

Published Mon, May 4 2015 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

రక్షణ మంత్రి ఆశ్చర్యం

రక్షణ మంత్రి ఆశ్చర్యం

పణజి: తన అధికార నివాసంలో సోదాలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశాలివ్వడం తనకు ఆశ్చర్యం కలిగించిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న పారికర్ అధికారిక నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు గోవా ట్రయల్ కోర్టు ఏప్రిల్ 22న సెర్చ్ వారెంట్ జారీ చేసింది.

అధికారిపై చేయి చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న గోవా మాజీ మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచేకో.. పారికర్ నివాసంలో తలదాచుకున్నారన్న సమాచారంతో కోర్టు ఈ ఆదేశాల్చింది. అయితే అదే రోజు సెర్చ్ వారెంట్ పై స్టే ఇచ్చింది. గోవా కోర్టు ఆదేశాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని పారికర్ అన్నారు. అంతకుముందు రోజే తాను అధికారిక నివాసంలోకి మారానని వెల్లడించారు. మిక్కీ పచేకోపై కేసు కోర్టులో ఉన్నందున ఏమీ మాట్లాడబోనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement