యాపిల్‌ ఇండియా హెడ్‌గా ఆశిష్‌ చౌదరి | Ashish Choudhary as Apple India Head | Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఇండియా హెడ్‌గా ఆశిష్‌ చౌదరి

Published Wed, Nov 14 2018 2:33 AM | Last Updated on Wed, Nov 14 2018 2:33 AM

Ashish Choudhary as Apple India Head - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తమ భారత విభాగానికి హెడ్‌గా ఆశిష్‌ చౌదరిని నియమించింది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

ప్రస్తుతం నోకియా నెట్‌వర్క్స్‌లో ఆయన చీఫ్‌ కస్టమర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. మరోవైపు, ఉన్నత స్థాయిలో మార్పులు, చేర్పులు చేపడుతున్నట్లు నోకియా వెల్లడించింది. దాదాపు 15 సంవత్సరాల పాటు కీలక హోదాల్లో పనిచేసిన ఆశిష్‌ చౌదరి ఈ ఏడాది ఆఖరునాటికి తప్పుకోనున్నట్లు, మరో సంస్థలో లీడర్‌షిప్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు వివరించింది. ఎంటర్‌ప్రైజ్, టెలికం రంగాల్లో చౌదరికి అంతర్జాతీయ స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement