Ashish Chowdhury
-
26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’
26/11 వింటేనే చాలు ఇప్పటికి అనేక మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఆవేదనతో గొంతు పూడుకుపోతుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున ముష్కరులు ముంబైలోని తాజ్ హోటల్ని అడ్డగా చేసుకుని రాక్షసకాండ సాగించారు. నాటి మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. నాడు మరణించిన వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ చౌదరి సోదరి, ఆమె భర్త కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని తలుచుకుంటూ ఆశిష్ చౌదరి భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్ననాటి ఫోటోలను, జ్ఞాపకాలని షేర్ చేసుకున్నారు. ‘మీరు లేకుండా నా జీవితంలో ఒక్క రోజు కూడా పూర్తవ్వదు. జిజు, మోనా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అన్నారు. ఫోటోలతో పాటు.. ‘ఈ రోజు నేను ఎలా ఉన్నానో చూడండి.. ఈ రోజు వరకు మీ జ్ఞాపకాలే నన్ను బలంగా నిలబడేలా చేశాయి. మీరున్నప్పుడు ప్రతి రోజు సంతోషంగా మనం ఆడుతూ పాడుతూ ఎలా గడిపామే ఇప్పుడు కూడా అలానే జీవిస్తున్నారును. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో మీరు నా పక్కనే ఉన్నారనే ఆశతోనే నేను శ్వాసించగల్గుతున్నాను. మీ జ్ఞాపకాలే నా బలం’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు ఆశిష్ చౌదరి. (ఇప్పటికైనా న్యాయం చేయండి: భారత్) View this post on Instagram A post shared by Ashish Chowdhry (@ashishchowdhryofficial) పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ముష్కరులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన మారణకాండ సాగింది. -
యాపిల్ ఇండియా హెడ్‌గా ఆశిష్ చౌదరి
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తమ భారత విభాగానికి హెడ్‌గా ఆశిష్ చౌదరిని నియమించింది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం నోకియా నెట్‌వర్క్స్‌లో ఆయన చీఫ్ కస్టమర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. మరోవైపు, ఉన్నత స్థాయిలో మార్పులు, చేర్పులు చేపడుతున్నట్లు నోకియా వెల్లడించింది. దాదాపు 15 సంవత్సరాల పాటు కీలక హోదాల్లో పనిచేసిన ఆశిష్ చౌదరి ఈ ఏడాది ఆఖరునాటికి తప్పుకోనున్నట్లు, మరో సంస్థలో లీడర్షిప్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వివరించింది. ఎంటర్ప్రైజ్, టెలికం రంగాల్లో చౌదరికి అంతర్జాతీయ స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. -
ఈ నటుడి ఫొటోలు తెగ వైరల్..
ముంబయి: సినిమాల్లో స్టంట్లు చిన్న విషయం కాదు. సినిమా తెరపై వాటిని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అయితే, ముఖ్యంగా ప్రమాదకర స్టంట్లు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువమందే డూప్‌లనే ఆశ్రయిస్తుంటారు. కొంతమంది నటులు మాత్రం డూప్ లేకుండా చేసి వారెవ్వా అనిపించుకుంటారు. ఇప్పుడు నిజంగా టీవీ సిరీస్ కోసం ఓ సాహసం చేసి ఆశిష్ చౌదరీ అనే ఈ బాలీవుడ్ నటుడు సూపర్ అనిపించుకున్నాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, కింద కూడా ఎలాంటి వలలు ఏర్పాటు చేయకుండా షూటింగ్లో పాల్గొన్నాడు. అది కూడా ఏకంగా 21వ అంతస్తు నుంచి. ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ చిత్రీకరణలో ఆశిష్ ఓ 21 అంతస్తుల భవనంపై ఓ స్టంట్ చేసే సీన్ అబ్బుర పరిచేలా చేశాడు. ఏకంగా నాలుగు గంటలపాటు షూట్ చేసిన ఈ సీన్లో తాను రిపీట్‌గా ఓ పైపును పట్టుకొని అంత ఎత్తు నుంచి గాల్లో తేలుతూ కనిపించాడు. గతంలో ఇలాంటి స్టంట్లు చేసి అతడు గాయపడినప్పటికీ సాహసాలు మాత్రం అతడు మానుకోలేదు. గతంలో తాను ఎన్నో స్టంట్లు చేశానని, అయితే, ఇది మాత్రం చాలా ప్రమాదకరమైన స్టంటు అని ఆశిష్ ఈ సందర్భంగా చెప్పాడు. నాలుగు గంటలపాటు షూట్ చేసిన ఈ సీన్ ఎన్ని నిమిషాల కోసమో తెలుసా.. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. దేవ్ అనే డిటెక్టివ్ సిరీస్ కోసం ఈ సీన్ షూట్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ కాగా.. వీటిని ఏమాత్రం ప్రోత్సహించకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.