ఈ నటుడి ఫొటోలు తెగ వైరల్‌.. | Ashish Chowdhury was hanging from 21st floor for 4 hours | Sakshi
Sakshi News home page

ఈ నటుడి ఫొటోలు తెగ వైరల్‌..

Published Tue, Aug 1 2017 5:13 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Ashish Chowdhury was hanging from 21st floor for 4 hours



ముంబయి: సినిమాల్లో స్టంట్లు చిన్న విషయం కాదు. సినిమా తెరపై వాటిని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అయితే, ముఖ్యంగా ప్రమాదకర స్టంట్లు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువమందే డూప్‌లనే ఆశ్రయిస్తుంటారు. కొంతమంది నటులు మాత్రం డూప్‌ లేకుండా చేసి వారెవ్వా అనిపించుకుంటారు. ఇప్పుడు నిజంగా టీవీ సిరీస్‌ కోసం ఓ సాహసం చేసి ఆశిష్‌ చౌదరీ అనే ఈ బాలీవుడ్‌ నటుడు సూపర్‌ అనిపించుకున్నాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, కింద కూడా ఎలాంటి వలలు ఏర్పాటు చేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. అది కూడా ఏకంగా 21వ అంతస్తు నుంచి.

ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ చిత్రీకరణలో ఆశిష్‌ ఓ 21 అంతస్తుల భవనంపై ఓ స్టంట్‌ చేసే సీన్‌ అబ్బుర పరిచేలా చేశాడు. ఏకంగా నాలుగు గంటలపాటు షూట్‌ చేసిన ఈ సీన్‌లో తాను రిపీట్‌గా ఓ పైపును పట్టుకొని అంత ఎత్తు నుంచి గాల్లో తేలుతూ కనిపించాడు. గతంలో ఇలాంటి స్టంట్లు చేసి అతడు గాయపడినప్పటికీ సాహసాలు మాత్రం అతడు మానుకోలేదు.

గతంలో తాను ఎన్నో స్టంట్లు చేశానని, అయితే, ఇది మాత్రం చాలా ప్రమాదకరమైన స్టంటు అని ఆశిష్‌ ఈ సందర్భంగా చెప్పాడు. నాలుగు గంటలపాటు షూట్‌ చేసిన ఈ సీన్‌ ఎన్ని నిమిషాల కోసమో తెలుసా.. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. దేవ్‌ అనే డిటెక్టివ్‌ సిరీస్‌ కోసం ఈ సీన్‌ షూట్‌ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్‌ ఇంట్లో వైరల్‌ కాగా.. వీటిని ఏమాత్రం ప్రోత్సహించకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement