కాలిఫోర్నియా : యాపిల్ సీఈవో టిమ్ కుక్ కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంలో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. శుక్రవారం ఉదయం అనూహ్యంగా యాపిల్ ప్రధాన కార్యాలయం, ఐకానిక్ గ్లాస్ క్యూబ్‌లోకి ప్రవేశించారు. దీంతో అభిమానుల సందడి నెలకొంది. కొత్త ఐ ఫోన్ 11 విక్రయాలు సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోను కొనుగోలు చేయడానికి వచ్చిన అభిమానులు టిమ్ కుక్‌తో సెల్ఫీదిగేందుకు క్యూ కట్టారు. అటు కొత్త ఫోన్ కోసం తెల్లవారుజాము నుండి లైన్లో ఉన్న వందలాది మంది కస్టమర్లను టిమ్ పలకరించారు. వారికి హై ఫైలు ఇస్తూ, సెల్పీలు దిగుతూ ఆకట్టుకున్నారు.
రెండున్నర సంవత్సరాలుగా మూసివేసిన ఈ ఆఫీసును పూర్తి హంగులతో ఐదవ అవెన్యూ స్టోర్ అసలు 32వేల చదరపు అడుగుల స్థలాన్ని 77వేల చదరపు అడుగులకు రెట్టింపు చేసారు. రెన్‌బో కలర్స్ దీన్ని అత్యంత సొగుసుగా తీర్చి దిద్దారు. 32 అడుగుల గ్లాస్ క్యూబ్ ను ఈ నెల ప్రారంభంలో తిరిగి ప్రారంభించారు. ఇది 24 గంటలు, 365 రోజులు వినియోగదారులకు అందుబాటులో ఉండే యాపిల్ స్టోర్ ఇదేనట.
కాగా ఇటీవల యాపిల్ హెడ్‌క్వార్టర్స్ క్యుపర్టినోలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియంలో ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఆడియో, డాల్బీ అట్మోస్ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6.1 లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్ సెల్ఫీలు, ఏ13 బయోనిక్ చిప్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్ 11 ధర 699 డాలర్ల నుంచి ప్రారంభం.
Tim Cook arrives at @Apple 5th Ave reopening as iPhone 11s go on sale. Greeted by about 300 customers. After a few selfies, some handshakes he made his way inside. 24-hour store reopens at 8 after being closed for nearly 3 years for renovations. More on @SquawkCNBC pic.twitter.com/aV2Z0WgJLS
— Rahel Solomon (@RahelCNBC) September 20, 2019
Comments
Please login to add a commentAdd a comment