జూన్ 7 నుంచి లండన్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా ఈ పోరులో తలపడుతున్నాయి. ఇక ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచులో గెలిచి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవాలని రెండు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే లండన్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా ఉన్నాయి.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఎంపిక చేశాడు. తన ఎంపిక చేసిన జట్టుతో ఆడితే భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని గవాస్కర్ థీమా వ్యక్తం చేశాడు. అందరూ ఊహించిన విధంగానే గవాస్కర్ తన జట్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చాడు. లిటిల్‌మాస్టర్ ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చాడు.
అదే విధంగా పుజారా మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, అజింక్య రహానె ఐదో స్థానంలో బ్యాటింగ్ వస్తే బాగుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్‌గా కిషన్‌ను కాదని భరత్ వైపే సన్నీ మొగ్గుచూపాడు. భరత్‌కు ఆరో స్ధానంలో చోటు ఇచ్చాడు. ఇక స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌కు అతడు అవకాశమిచ్చాడు. చివరగా ఫాస్ట్ బౌలర్ల విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లకు గవాస్కర్ ఛాన్స్ ఇచ్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సునీల్ గవాస్కర్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment