ఆస్ట్రేలియా పర్యటనలో వైవీ సుబ్బారెడ్డి | TTD Chairman YV Subba Reddy Visits Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా పర్యటనలో వైవీ సుబ్బారెడ్డి

Published Tue, Nov 5 2019 9:08 PM | Last Updated on Tue, Nov 5 2019 10:20 PM

TTD Chairman YV Subba Reddy Visits Australia - Sakshi

సిడ్నీ: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఆ దేశ పార్లమెంట్‌ భవనాన్ని సుబ్బారెడ్డి దంపతులు సందర్శించారు. అనంతరం ఆయన ఆసీస్ డిప్యూటీ హైకమిషనర్‌తో, భారత డిప్యూటీ హై కమిషనర్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆస్ట్రేలియా పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. తర్వాత సిడ్నీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement