
సిడ్నీ : 21 ఏళ్ల ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. కనపడిన వారిపై ఇష్టమొచ్చినట్లు కత్తితో దాడి చేశాడు. దారుణంగా ఓ వేశ్యను చంపటమే కాకుండా కత్తితో రోడ్లపైకి వచ్చి హల్‌చల్ చేశాడు. ఈ సంఘటన మంగళవారం సిడ్నీ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. మెర్ట్ నే అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం సమయంలో యార్క్ స్ట్రీట్ గుండా కత్తితో సంచరిస్తూ కనపడిన వారిపై దాడికి దిగాడు. 24 ఏళ్ల ఓ వేశ్యపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. అనంతరం గట్టిగా అరుస్తూ అక్కడి వీధులు మొత్తం చక్కర్లు కొట్టాడు. చక్కగా అక్కడ ఓ సెల్ఫీ తీసుకుని రోడ్డుపై వెళుతున్న కార్లపైకి ఎగబడ్డాడు. కారుపైకి ఎక్కిన మెర్ట్ కత్తిని పైకి చూపిస్తూ గట్టిగా అరవటం మొదలుపెట్డాడు. దీంతో అక్కడివారు పోలీసులకు సమాచారం అందించారు. కుర్చీలు, ఇతర వస్తువుల సహాయంతో అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Comments
Please login to add a commentAdd a comment