న్యూఢిల్లీ:ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో ఓ కేఫ్లో ఆగంతకులు రెచ్చిపోవడంతో అక్కడి భారత కాన్సులేట్ ను మూసివేశారు.కా న్సులేట్ సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సిడ్నీలోని డిప్యూటీ కన్సల్ జనరల్ వినోద్ బాహాదే తెలిపారు. నగరంలోని మార్టిన్ ప్లేస్లోని కేఫ్ లో13 మందిని ఆగంతకులు నిర్బంధిండంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్నవారిని విడిపించేందుకు యత్నిస్తోంది.
దీనిలో భాగంగా అక్కడి భారీగా పోలీస్ బలగాలను మోహరించి బందీలుగా పట్టుబడిన వారిని విడిపించేందుకు యత్నిస్తున్నారు. లోపల ఉన్న దుండగుల వద్ద ఉన్న జెండాల్లో అరబిక్ అక్షరాలను బట్టి వాళ్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. ఆగంతుకుల చెరనుంచి ముగ్గురు తప్పించుకుని సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.