Australian police
-
మిస్టరీ కిల్లర్.. పట్టిస్తే 30 కోట్లు..
సిడ్నీ: దశాబ్దాలు గడిచిన చిక్కువీడని ఓ మిస్టరీ కేసుతో ఆస్ట్రేలియన్ పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. చివరికి చేసేదేమి లేక శనివారం రికార్డు రివార్డు ప్రకటించారు. 1980లో మెల్ బోర్న్లో జరిగిన వరుస మహిళల హత్యకేసును ఛేదించడం కోసం ఏకంగా రూ.30 కోట్ల రికార్డు రివార్డును ఆఫర్ చేశారు. 1980-1981 మధ్య కాలంలో దుండగలు 14 నుంచి 73 ఏళ్ల వయసుగల ఆరుగురు మహిళలను హతమార్చారు. ఆనాటి నుంచి ఈ కేసు మిస్టరీగా మారింది. ఈ కేసును ఛేదించేందుకు నడుంబిగించిన విక్టోరియా పోలీసులు సమాచారం అందించినా, మిస్టరీ ఛేదించినా ఒక్కో కేసుకు రూ.5 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఇది ఆస్ట్రేలియన్ పోలీసులు ప్రకటించిన రెండో అతిపెద్ద రివార్డని తెలిపారు. అంతేగాకుండా ఎవరికైనా మిస్టరీలు ఛేదించే మేధాశక్తి ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. అయితే ఈ రివార్డుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'దొంగలు పడ్డాక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన'చందంగా పోలీసులు తీరుందని విమర్శిస్తున్నారు. -
హైదరాబాద్ వచ్చిన ఆస్ట్రేలియా పోలీసులు
సికింద్రాబాద్: నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను ఆస్ట్రేలియా పోలీసుల బృందం శనివారం సందర్శించింది. మాథ్యూస్ అనే పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం ముందుగా అబిడ్స్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించింది. అనంతరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. కేసుల నమోదు, దర్యాప్తు, నేరం జరిగితే నిందితులను గుర్తించే విధానం, సంఘటన స్థలానికి ఎంత సమయంలో చేరుకుంటారు, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే ఎవర్ని కలవాలి, వారితో వ్యవహరించే తీరు ఇలా అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. వారికి నార్త్‌జోన్ అడిషినల్ డీసీపీ పీవై యాదగిరి వివరాలు తెలియజేశారు. భారత పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు వీరు పర్యటిస్తున్నట్టు సమాచారం. -
చంపేస్తా... నీ పని అయిపోయినట్లే!
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వారం కిందట ఓ ఫ్లాట్ నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. భయంతో కూడిన అరుపులు ‘నేను నిన్ను చంపేస్తా. నీ పని అయిపోయింది. చావు... చావు’ అని గట్టిగా కేకలు వినిపించేసరికి అపార్ట్మెంటులోని ఇరుగుపొరుగు ఫ్లాట్లలో నివసించే వారు కంగారుపడిపోయారు. ఏదో ఘోరం జరుగుతోందనుకొని... పోలీసులకు ఫోన్ కొట్టారు. భార్యాభర్తలో, ప్రేమికులో గొడవ పడుతున్నారని... చంపేస్తాననే కేకలు వినపడుతున్నాయని ఫిర్యాదు చేశారు. దాంతో ఆగమేఘాల మీద పోలీసులు వచ్చేశారు. సదరు అరుపులు వినిపించిన ఫ్లాట్‌ను చుట్టుముట్టి... డోర్ కొట్టారు. 30లలో ఉన్న వ్యక్తి తలుపుతీసి భారీ సంఖ్యలో ఉన్న పోలీసులను చూసి నివ్వెరపోయాడు. పోలీసులు ఫ్లాట్‌లో వెతుకుతూ... ఎక్కడ నీ భార్య లేక గర్ల్‌ఫ్రెండ్ ఎక్కడ? అంటూ గద్దించారు. వెర్రిమొహం వేసిన అతను... ‘నాకెవరూ లేరు. నేను ఒంటరిగా ఉంటాను’ అంటూ బదులిచ్చాడు. మరి చంపేస్తాననే కేకలేంటి? అని పోలీసులు అడగ్గా.... అప్పుడు విషయం అర్థమైంది మనోడికి. ‘ఓ అదా... పెద్ద సాలీడు ఫ్లాట్‌లో చొరబడింది. దాన్ని చంపుదామని స్ప్రేతో వెంటపడ్డాను. ఆ సందర్భంగా అన్నాను’ అంటూ అసలు విషయం చెప్పాడు. మరి భయంతో కూడిన అరుపులు వినిపించాయి అని అడగ్గా... మనోడు మెలికలు తిరిగిపోతూ ‘సారీ... నాకు సాలీడు అంటే విపరీతమైన భయం. దాంతో మొదట్లో భయంతో అరిచాను. తర్వాత చంపేస్తానంటూ దాని వెంటపడ్డాను’ అని మెలికలు తిరిగిపోతూ చెప్పాడట. ఓరి నీ దుంపతెగ... అనవసరంగా మా సమయం అంతా వృథా చేశావంటూ పోలీసులు ఓ నిట్టూర్పు విడిచి వెళ్లిపోయారట. -
విశ్వకాంత్ అంకిరెడ్డి సురక్షితం
-
విశ్వకాంత్ అంకిరెడ్డి సురక్షితం
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కిడ్నాపర్ చెరలో బందీగా ఉన్న గుంటూరు జిల్లా వాసి విశ్వకాంత్ అంకిరెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. సాయుధ బలగాలు ఆయనను సురక్షితంగా విడిపించాయి. లింట్డ్ కేఫ్ లో బందీలు ఉన్నవారందరినీ కమెండోలు బయటకు తీసుకొచ్చారు. మొత్తం 15 మంది బందీలను విడిపించినట్టు సమాచారం. 16 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బందీలను విడిపించారు. వీరిలో భారతీయుడు పుష్పేందు ఘోష్ కూడా ఉన్నారు. సాయుధ కమెండోలు, కిడ్నాపర్ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని సిడ్నీ పోలీసులు ప్రకటించారు. కిడ్నాపర్ షేక్ మన్ హారొన్ మోనిస్, మరొక బందీ మృతి చెందినట్టు సమాచారం. విశ్వకాంత్ సురక్షితంగా బయపడ్డారన్న సమాచారంతో గుంటూరు జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
సిడ్నీ కిడ్నాపర్ల చెరలో విశ్వకాంత్.
-
సిడ్నీ దుండగుడు.. ఇరానీగా గుర్తింపు!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా పలువురిని కిడ్నాప్ చేసిన దుండగుడిని ఎట్టకేలకు గుర్తించారు. షేక్ మన్ హారొన్ మోనిస్ అనే పాత నేరస్థుడే ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అతడికి ఇప్పటికే చాలా నేరచరిత్ర ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పలు నేరాల్లో ఇంతకుముందు శిక్షలు కూడా అనుభవించాడని ఆ వర్గాలు చెప్పాయి. అతడు ఇరాన్ దేశానికి చెందిన రాడికల్ ముస్లిం నాయకుడని, ఏడుగురు మహిళలను లైంగికంగా వేధించాడని సమాచారం. అఫ్ఘానిస్థాన్ లో ఆస్ట్రేలియన్ బలగాల మోహరింపునకు నిరసనగా ఈ కిడ్నాప్ తతంగానికి పాల్పడినట్లు తెలిసింది. 1996 సంవత్సరంలోనే అతడు ఇరాన్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.10 గంటల సమయంలో 13 మందిని అపహరించిన మోనిస్.. వారిని ఓ కేఫ్‌లో ఉంచాడు. అయితే వాళ్లలో ఐదుగురు మాత్రం ఎలాగోలా తప్పించుకోగలిగారు. గుంటూరు జిల్లాకు చెందిన అంకిరెడ్డి విశ్వకాంత్ సహా మరికొందరు మాత్రం ఇంకా మోనిస్ అదుపులోనే ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్తోనే తాను చర్చలు జరుపుతానని అతడు డిమాండ్ చేస్తున్నాడు. -
సిడ్నీ కిడ్నాపర్ల చెరలో విశ్వకాంత్
గుంటూరు జిల్లాకు చెందిన అంకిరెడ్డి విశ్వకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిడ్నీ కిడ్నాపర్ల చెరలో చిక్కుకున్నారు. ఈ విషయమై గుంటూరు జిల్లా పోలీసులకు సమాచారం అందింది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యుల ఆచూకీ ఆరా తీసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. గత కొంత కాలంగా విశ్వకాంత్ సిడ్నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉన్నారు. మొత్తం 12 మందిని కిడ్నాప్ చేయగా, వారిలో ఐదుగురు తప్పించుకున్నారు. గంట క్రితమే ఈ కిడ్నాపర్ల చెరలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన యువకుడని తెలిసింది. విశ్వకాంత్ సోదరుడు స్థానికంగానే ఉంటారు. అతడి కిడ్నాప్ విషయాన్ని కుటుంబ సభ్యులకు అందించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆయనను క్షేమంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
సిడ్నీ ఆగంతకుల చెరలో గుంటూరు టెకీ
న్యూఢిల్లీ: సిడ్నీలో ఓ కేఫ్ లో కి ఆగంతకులు చొరబడి కొంతమందిని బందీలుగా నిర్భందించిన అంశం కలకలం సృష్టిస్తోంది. ఐఎస్ఐఎస్ఐ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నఆగంతకులు సోమవారం ఉదయం మార్టిన్ ప్లేస్‌లోని ఓ కేఫ్‌లో ప్రవేశించి అందులో ఉన్న కొంతమందిని బందీలుగా నిర్భందించారు. వారిలో ఒక భారతీయ ఇంజనీర్ కూడా బందీగా చిక్కుకున్నాడు. ఆయనను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పిడుగురాళ్ల మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన విశ్వకాంత్ అంకిరెడ్డి ఈ బందీలలో ఉన్నట్లు తాజాగా తెలిసింది. ఆయన అక్కడ ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్నారు. విశ్వకాంత్ కూడా ఆగంతకుల చిక్కుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం కూడా అందిందని ఆయన స్పష్టం చేశారు. బందీలుగా పట్టుబడిన వారిని విడిపించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, తాము ప్రధాని టోనీ అబాట్ తో మాట్లాడాలని ఆగంతకులు డిమాండ్ చేస్తున్నారు. -
సిడ్నీలో భారత కాన్సులేట్ మూసివేత
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో ఓ కేఫ్‌లో ఆగంతకులు రెచ్చిపోవడంతో అక్కడి భారత కాన్సులేట్ ను మూసివేశారు.కా న్సులేట్ సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సిడ్నీలోని డిప్యూటీ కన్సల్ జనరల్ వినోద్ బాహాదే తెలిపారు. నగరంలోని మార్టిన్ ప్లేస్‌లోని కేఫ్ లో13 మందిని ఆగంతకులు నిర్బంధిండంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్నవారిని విడిపించేందుకు యత్నిస్తోంది. దీనిలో భాగంగా అక్కడి భారీగా పోలీస్ బలగాలను మోహరించి బందీలుగా పట్టుబడిన వారిని విడిపించేందుకు యత్నిస్తున్నారు. లోపల ఉన్న దుండగుల వద్ద ఉన్న జెండాల్లో అరబిక్ అక్షరాలను బట్టి వాళ్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. ఆగంతుకుల చెరనుంచి ముగ్గురు తప్పించుకుని సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. -
సిడ్నీలో హైటెన్షన్, రెచ్చిపోయిన ఆగంతకులు
సిడ్నీ : ఆస్ట్రేలియా సిడ్నీలో ఆగంతకులు రెచ్చిపోయారు. దాంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. నగరంలోని మార్టిన్ ప్లేస్‌లోని ఓ కేఫ్‌లో 13మందిని ఆగంతకులు నిర్బంధించారు. దాంతో పోలీసులు కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్నవారిని విడిపించేందుకు యత్నిస్తున్నారు. దుండగుల అదుపులో డజన్ల సంఖ్యలో వ్యక్తులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఒపెరా హౌస్ ను ఖాళీ చేయించారు. లోపల ఉన్న దుండగుల వద్ద ఉన్న జెండాల్లో అరబిక్ అక్షరాలను బట్టి వాళ్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీఅబాట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఆయన సమీక్షించారు. జాతీయ భద్రతా దళాలను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. మరోవైపు జాతీయ భద్రతా దళాలు అక్కడకు చేరుకుని... చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు. నిర్బంధంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావటమే తమ లక్ష్యమన్నారు. సిడ్ని నగరంపై ఏ విమానాలు తిరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రతా బలగాలు సిడ్ని వ్యాపార కేంద్రాన్ని చుట్టుముట్టాయి.