హైదరాబాద్ వచ్చిన ఆస్ట్రేలియా పోలీసులు
హైదరాబాద్ వచ్చిన ఆస్ట్రేలియా పోలీసులు
Published Sat, Feb 13 2016 2:09 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
సికింద్రాబాద్: నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను ఆస్ట్రేలియా పోలీసుల బృందం శనివారం సందర్శించింది. మాథ్యూస్ అనే పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం ముందుగా అబిడ్స్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించింది. అనంతరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది.
కేసుల నమోదు, దర్యాప్తు, నేరం జరిగితే నిందితులను గుర్తించే విధానం, సంఘటన స్థలానికి ఎంత సమయంలో చేరుకుంటారు, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే ఎవర్ని కలవాలి, వారితో వ్యవహరించే తీరు ఇలా అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. వారికి నార్త్‌జోన్ అడిషినల్ డీసీపీ పీవై యాదగిరి వివరాలు తెలియజేశారు. భారత పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు వీరు పర్యటిస్తున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement