ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటిదాకా ఈ మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో.. పలు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం.. బహిరంగ ప్రదేశాల్లో సంచరించాల్సి వచ్చినపుడు మాస్కులు ధరించడం సహా ఇతర చిట్కాలు పాటిస్తూ తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఓ ఆస్ట్రేలియా మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. తన ప్రవర్తనతో తోటి ప్రయాణికుడిని ఇబ్బందుల పాలుజేసింది. (‘కోవిడ్’పై ట్రంప్ ట్వీట్.. కీలక నిర్ణయం!)
అసలేం జరిగిందంటే... సిడ్నీలో ఇంటర్‌సిటీ వీ- సెట్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సదరు మహిళకు ఓ వ్యక్తి ఎదురుగా కూర్చున్నాడు. ఈ క్రమంలో అదే పనిగా ఆమె దగ్గుతుండటంతో.. నోటికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆమె.. ‘‘నేనేమీ నోరు తెరవలేదు. లోలోపలే దగ్గుతున్నా. నీకేమైంది. నువ్వు పనికిమాలిన వాడివి’’అంటూ అతడికి దగ్గరగా వెళ్లి మరీ దగ్గింది. ఆమె చర్యతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. ‘‘ఇంత చెత్తగా ఎలా ప్రవర్తిస్తున్నావు’’ అంటూ మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు దాదాపు 100 మంది కరోనా బారిన పడ్డారు. ముగ్గురికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.(వాటి కారణంగానే కోవిడ్ వ్యాప్తి!)
Comments
Please login to add a commentAdd a comment