వాషింగ్టన్: స్కూల్ బస్సు సైజు భారీ గ్రహ శకలం ఒకటి భూమి దారిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురువారం అది భూమిని సురక్షితంగా దాటనుందని తెలిపారు. కొత్తగా గుర్తించిన ఈ గ్రహశకలం భూమికి 13 వేల మైళ్ల లోపల వస్తుందని.. ఇది భూమి చుట్టు ప్రదక్షిణ చేసే అనేక సమాచార ఉపగ్రహాల కన్నా చాలా తక్కువ లోతులో ఉందని తెలిపారు. ఇది గురువారం ఉదయం ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో భూమికి సమీపంగా వస్తుందన్నారు. గ్రహశకలం పరిమాణం 15-30 అడుగుల (4.5 మీటర్ల నుండి 9 మీటర్లు) మధ్య ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉల్క ప్రమాణాల ప్రకారం, ఇది చిన్నదిగా పరిగణించబడుతుంది. (చదవండి: మాస్క్‌తో భూమికి సమీపంలో 1998 గ్రహశకలం..!)
ఈ గ్రహ శకలాలు ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సార్లు భూమి వాతావరణాన్ని తాకి కాలిపోతాయని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డైరెక్టర్ పాల్ చోడాస్ తెలిపారు. ఈ చిన్న గ్రహశకలాలు 100 మిలియన్లు అక్కడ ఉండవచ్చని అంచనా వేశారు. ఈ గ్రహ శకలం తిరిగి 2041 ప్రాంతంలో భూమి సమీపంలోకి వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment