న్యూఢిల్లీ: అంటార్కిటికాలో దట్టమైన మంచు గర్భంలో 7.6 కిలోల బరువైన ఉల్కను అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వెలికితీసింది. మంచు ఖండంలో ఇంతటి భారీ ఉల్క దొరకడం అత్యంత అరుదైన విషయమని పేర్కొంది. గత డిసెంబర్ 11 నుంచి నెల రోజుల పాటు జరిపిన అన్వేషణలో మరిన్ని చిన్న సైజు ఉల్కలు కూడా దొరికాయి.
శాటిలైట్ ఇమేజీలు, జీపీఎస్ సాయంతో వీటి జాడను కనిపెట్టారు. ‘‘ఇవి బహుశా ఏదో ఆస్టిరాయిడ్ నుంచి రాలి పడి ఉంటాయి. వేలాది ఏళ్లుగా మంచు గర్భంలో ఉండిపోయాయి. వీటిని పరిశోధన నిమిత్తం బ్రెసెల్స్‌కు పంపాం. అందులో భూమి ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment