నాసా అలర్ట్.. భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం! | Giant Asteroid 1994 PC1 Coming Close To Earth On Jan 18 | Sakshi
Sakshi News home page

నాసా అలర్ట్.. భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం!

Published Mon, Jan 17 2022 7:54 PM | Last Updated on Mon, Jan 17 2022 8:28 PM

Giant Asteroid 1994 PC1 Coming Close To Earth On Jan 18 - Sakshi

ప్రపంచంలోని అతిపెద్ద భవనం బుర్జ్ ఖలీఫా కంటే పెద్దదిగా ఉన్న ఒక గ్రహాశకలం భూమి వైపు దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీ1గా నామకరణం చేశారు. నాసా పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనుంది. నాసా 1994 పీసీ1 గ్రహశకలాన్ని ప్రమాదకరమైన గ్రహశకలంగా వర్గీకరించింది. దీనిని మొదట ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. 

ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు నాసా తెలిపింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం 1 కి.మీ వ్యాసం కలిగి ఉంది. గ్రహాశకలంతో (7482) 1994 పీసీ1 పాటు అనేక ఇతర గ్రహశకలాలు కూడా జనవరి నెలలో భూమిని దాటే అవకాశం ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భూమికి దగ్గరగా 5 గ్రహశకలాలు వస్తున్నాయని నివేదించింది. ఈ పెద్ద గ్రహశకలాన్ని రేపు టెలిస్కోప్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే, నాసా దీనిని ట్రాక్ చేయడానికి ఒక లింకు కూడా ట్విటర్ వేదికగా షేర్ చేసింది.

(చదవండి: కేంద్ర బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement