
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రపంచవ్యాప్తంగా మంగళవారం కూడా బ్లూ మూన్ కనువిందు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అతిపెద్ద చంద్రుడు ప్రజలకు కనువిందు చేశాడు.
నేడు, రేపు భూమికి దగ్గరగా ఉల్కలు..
బ్లూ మూన్‌తో పాటు బుధ, గురువారాల్లో మరో ఆవిష్కరణ చోటు చేసుకోనుంది. బుధ, గురువారాల్లో సప్తరుషి మండలం నుంచి ఉల్కాపాతం భూ వాతావరణానికి దగ్గరగా ప్రయాణించనున్నాయి. ఈ నెల 31న కూడా రెండో సారి బ్లూ మూన్ ఉండటంతో ఉల్కాపాతాల ప్రయాణం పెద్దగా కనిపించకపోవచ్చని సైన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఒకే నెలలో రెండు సార్లు బ్లూమూన్‌తో పాటు ఉల్కాపాతాల ప్రయాణం ఉండటంతో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విషయాన్ని తెలియజేయవచ్చని జిల్లా సైన్స్ అ«ధికారి శరత్‌కృష్ణ తెలిపారు.