భూమికి మరో ప్రమాదం తప్పింది. అంతరిక్షంలోని ఒక చిన్న గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు వేగంగా ప్రయాణిస్తోందని గతంలో ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్‌వర్క్ (ఐఏడబ్ల్యూఎన్) ప్రకటించింది. తాజాగా ఈ గ్రహశకలం తన దిశను మార్చుకుని.. భూమికి అత్యంత సమీపంనుంచి ప్రయాణిస్తోందని ఐఏడబ్ల్యూఎన్ పేర్కొంది. గ్రహశకలం ప్రయాణిస్తున్న వేగాన్ని అంచనా వేస్తే గురువారం ఉదయం 11.12 నిమిషాలకు భూమిని దాటుకుని ముందు వెళుతుందని ఆ సంస్థ తెలిపింది. ఆ సమయంలో ఆస్టరాయిడ్..భూమికి 42 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.