
వాషింగ్టన్: ‘ఆస్టరాయిడ్ 2020ఎన్డీ’ ఈ నెల 24న భూమిని దాటుతుందని నాసా పేర్కొంది. ఆదివారం 2016 డీవై30, 2020 ఎంఈ3 అనే మరో రెండు ఆస్టరాయిడ్లు భూమిని దాటతాయని వెల్లడించింది. (ఐరాసకు ఇది పునర్జన్మ: మోదీ)
170 మీటర్లు పొడవైన ఆస్టరాయిడ్ 2020ఎన్డీ భూమిని 5.86 లక్షల కిలోమీటర్ల దూరంలో, గంటకు 48 వేల కిలోమీటర్ల వేగంతో దాటుతుందని పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్ ప్రమాదకర జోన్లో ప్రయాణిస్తుందని చెప్పింది. (నిరాడంబరంగా బ్రిటన్ ప్రిన్సెస్ వివాహం)
2016డీవై30 గంటకు 54 వేల కిలోమీటర్ల వేగంతో, 2020ఎంఈ3 16 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వెల్లడించింది. 2016డీవై30 రెండు ఆస్టరాయిడ్లలో 15 అడుగుల వెడల్పుతో అతి పెద్దదని తెలిపింది. వీటి వల్ల భూమికి ఎలాంటి అపాయం జరగదని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment