![Scary Asteroid Shoots Past Earth Surprises NASA - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/31/asteriod.jpg.webp?itok=m4Y3vrV5)
Scary Asteroid Shoots Past Earth Surprises NASA: కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమ్మీద నివసించిన డైనోసర్లు ఒక్కసారిగా కనుమరుగయ్యాయంటే...భారీ గ్రహశకలం భూమిని ఢీ కొట్టడంతో అవి పూర్తిగా అంతరించి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. అంతరిక్షంలోని పలు గ్రహశకలాల నుంచి భూమికి ముప్పు ఉంది. గ్రహశకలాలు భూమి దగ్గరగా దూసుకువస్తోనే ఉంటాయి. గురుగ్రహం గురుత్వాకర్షణ శక్తితో ఆస్టరాయిడ్ బెల్ట్‌లోని అనేక గ్రహశకలాలు భూమివైపుగా రావడంలేదు. కాగా కొన్ని అదుపు తప్పిన గ్రహశకలాలు భూమికి దగ్గరగా వస్తోంటాయి.
చదవండి: సత్యనాదెల్లా రాకతో..! నెంబర్ 1 స్థానం మైక్రోసాఫ్ట్ సొంతం..!
భూమి వైపుగా దూసుకువస్తోన్న పలు గ్రహశకలాల గుర్తింపు, వాటి గమనాలపై రోదసీ శాస్త్రవేత్తలు ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉంటారు. తాజాగా శాస్తవేత్తలు కూడా గుర్తించని ఓ గ్రహశకలం అక్టోబర్ 24 ఆదివారం రోజున భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిపోయింది. ఆస్టరాయిడ్ 2021 యూఎ1 అనే గ్రహశకలం భూమికి సుమారు 3000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆస్టరాయిడ్ 2 మీటర్ల పరిమాణంలో ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహశకలం భూమివైపుగా వస్తే అంటార్కిటికా దృవంపై పడేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిమాణంలో ఈ గ్రహశకలం చిన్నగా ఉన్నప్పటీకి..అది భూమిని తాకి ఉంటే ఎంతోకొంత ముప్పు వాటిల్లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
శాస్త్రవేత్తలు కంటపడలే...!
భూమి వైపుగా దూసుకువచ్చే ఆస్టరాయిడ్స్‌పై నాసా శాస్త్రవేత్తలు ఎప్పుడు అలర్ట్‌గా ఉంటారు. భూమి వైపుకు వచ్చే అన్ని గ్రహశకలాలను ట్రాక్ చేస్తుంటారు. అయితే గత ఆదివారం భూమి వైపుగా దూసుకొచ్చిన ఆస్ట్రాయిడ్ 2021 యూఎ1 ను శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. కాగా అంతరిక్షంలోని గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేయడంలో తన అసమర్థతను నాసా అంగీకరించింది. ఈ గ్రహశకలం సూర్యుడి వచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రకాశవంతమైన కాంతి కారణంగా శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని గుర్తించలేకపోయారని ఖగోళ శాస్త్రవేత్త టోనీ డన్ చెప్పారు. ఈ గ్రహశకలం భూమిని దాటిన గమనాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు.
Newly-discovered #asteroid 2021 UA1 missed Antarctica by only 3000 km Sunday evening.
— Tony Dunn (@tony873004) October 27, 2021
It came from the daytime sky, so it was undiscoverable prior to closest approach.https://t.co/Y0zY7mAYue pic.twitter.com/R9VpMo2X9G
చదవండి: పేరు మార్చాడో లేదో...! ఏకంగా యాపిల్‌కే గురిపెట్టాడు..!
Comments
Please login to add a commentAdd a comment