వాషింగ్టన్: వేరశనగ ఆకారంలోని ఓ ఆస్టరాయిడ్ గత వారాంతంలో భూమికి అత్యంత చేరువగా వచ్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు గుర్తించారు. 1999 జేడీ6గా పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ జూలై 24న భూమికి 7.2 మిలియన్ కిలోమీటర్ల చేరువకు వచ్చిందని వారు తెలిపారు. ఈ దూరం భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 19రెట్లు ఎక్కువ. మరలా 2054లో ఒక ఆస్టరాయిడ్ భూమికి ఇంత చేరువగా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్టరాయిడ్‌లను గుర్తించడానికి, వాటిని నుంచి భూమికి రక్షణ కల్పించడానికి నాసా ‘ఆస్టరాయిడ్ ట్రాకింగ్’ మిషన్ కృషి చేస్తోంది.
భూమికి చేరువగా వచ్చిన ఆస్టరాయిడ్
Published Mon, Aug 3 2015 7:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement