naasa
-
భూమికి చేరువగా వచ్చిన ఆస్టరాయిడ్
వాషింగ్టన్: వేరశనగ ఆకారంలోని ఓ ఆస్టరాయిడ్ గత వారాంతంలో భూమికి అత్యంత చేరువగా వచ్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు గుర్తించారు. 1999 జేడీ6గా పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ జూలై 24న భూమికి 7.2 మిలియన్ కిలోమీటర్ల చేరువకు వచ్చిందని వారు తెలిపారు. ఈ దూరం భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 19రెట్లు ఎక్కువ. మరలా 2054లో ఒక ఆస్టరాయిడ్ భూమికి ఇంత చేరువగా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్టరాయిడ్లను గుర్తించడానికి, వాటిని నుంచి భూమికి రక్షణ కల్పించడానికి నాసా ‘ఆస్టరాయిడ్ ట్రాకింగ్’ మిషన్ కృషి చేస్తోంది. -
అంతరిక్షం నుంచి మొదటి ఫొటో..!
సగం నల్లగా.. సగం బూడిద వర్ణంలో ఉన్న ఈ ఫొటో దేనిదబ్బా.. అనుకుంటున్నారా? మన భూగోళమే! రోదసి నుంచి మొట్ట మొదటిసారిగా తీసిన భూమి ఫొటో ఇది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. అక్టోబరు 1946లో ప్రయోగించిన ‘వీ2 రాకెట్’కు అమర్చిన కెమెరాలు తీసిన ఫొటోలను కూర్చి.. క్లైడ్ హాలిడే అనే ఇంజనీర్ ఈ ఫొటోను రూపొందించారు. ఫిబ్రవరి 26న లండన్‌లో ‘డ్రివీట్స్ అండ్ బ్లూమ్స్బరీ’ సంస్థ వేయనున్న వేలంలో దీనికి రూ.94 వేలు పలుకవచ్చని అంచనా. దీనితో పాటు నాసాకు చెందిన ఇలాంటి అరుదైన 600 ఫొటోలను వేలం వేయనుండగా.. అన్నింటికీ కలిపి రూ. 4.72 కోట్ల వరకు రావచ్చని భావిస్తున్నారు. చంద్రుడిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టినప్పటి ఫొటోలు, అంతరిక్షం నుంచి బజ్ ఆల్డ్రిన్ తీసుకున్న తొలి సెల్ఫీ, ఇంతవరకూ బయటివారెవరూ చూడనటువంటి అరుదైన ఫొటోలూ వీటిలో ఉన్నాయట.