
ఓ వ్యక్తి నులుపోగులేకుండా వీధుల్లో హల్‌చల్ చేశాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పైగా తాను వేరే గ్రహం నుంచి వచ్చానని చెబుతున్నాడు. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌లో నగ్నంగా ఓ వ్యక్తి వీధుల్లో హల్‌చల్ చేశాడు. ఓ దుకాణం వద్దకు నగ్నంగా నడుచుకుంటూ వస్తున్న ఆ వ్యక్తిని చూసి.. భయపడిన ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. ఐతే ఆ వ్యక్తి బట్టలు ఎక్కడ వదిలేశానో తెలియదని విచిత్రమైన సమాధానం చెప్పాడు.
తన పేరు, పుట్టిన తేది చెప్పేందుకు కూడా నిరాకరించాడు. అతను ఏ రాష్ట్రం నుంచి వచ్చాడని వాకాబు చేసేన, ఐడీ కార్డు గురించి అడిగినా..ఏమి లేవు, తెలియదు అనే బదులిస్తున్నాడు ఆ వ్యక్తి. దీంతో పోలీసులు ఆ వ్యక్తి గురించి ముమ్మరంగా విచారించి..అతను 44 ఏళ్ల జాసన్ స్మిత్‌గా గుర్తించారు. పైగా తాను వేరే గ్రహం నుంచి వస్తున్నట్లు ఏవేవో కథలు చెబుతున్నాడు. ఐతే పోలీసులు అతనిపై బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణలు మోపి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
(చదవండి: గన్ కల్చర్‌పై విరుచుకుపడ్డ ప్రభుత్వం..ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు..)
Comments
Please login to add a commentAdd a comment