![vladimir mikhailovich komarov russian astronaut first to die during space mission - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/6/vladimir-1.gif.webp?itok=j9UPqZcd)
అంతరిక్షయాత్రలు, వ్యోమగాముల గురించిన కథనాలు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుంటాయి. అలాంటి వ్యోమగాములలో ఒకరే వాల్దిమిర్ మిఖాయిలోచివ్ కొమారోవ్. రష్యా వ్యోమగామి అయిన ఈయన అంతరిక్షయాత్రలోనే కన్నుమూసిన తొలివ్యక్తి. 1967, ఏప్రిల్ 24న తన రెండవ అంతరిక్షయానం నుంచి తిరిగివస్తున్న సందర్బంలో స్పేస్‌క్రాఫ్ట్ దుర్ఘటనలో కన్నుమూశారు.
సోవియట్ టెస్ట్ పైలెట్, ఎయిర్‌ఫోర్స్ ఇంజినీరు, కాస్మోనాట్ అయిన వ్లాదిమిర్ 1964లో అధిక సిబ్బందిని మోసుకువెళ్లే మొదటి వ్యోమనౌక వోస్కోడ్ -1కు.. సారధ్య బాధ్యతలు నిర్వహించారు. కొమారోవ్ ముగ్గురు సభ్యుల అంతరిక్ష నౌక వోస్కోడ్‌ను 16 సార్లు భూ మండలం చుట్టూ నడిపారు. సోయుజ్- 1కు సోలో పైలట్‌గా ఎంపికైనప్పుడు అతను రెండుసార్లు అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యోమగామిగా నిలిచారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవం, అంతరిక్షయానంలో శిక్షణ పొందిన 18 మందిలో ఒకరైన కొమారోవ్ 1964 అక్టోబరు 12న అంతరిక్షయానంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
రష్యా సమాచార సంస్థ టీఏఎస్‌ఎస్ తెలిపిన వివరాల ప్రకారం సోయుజ్-1కు సంబంధించిన కక్ష్య విన్యాసాలు,సిస్టమ్ పరీక్షలతో కూడిన విమాన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. దీని తరువాత 1967 ఏప్రిల్ 24న ఈ అంతరిక్షనౌకను భూమికి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోయుజ్-I 23,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు, ఒక పారాచూట్‌ని వినియోగించాల్సి ఉంది. ఇది కొమరోవ్‌ను సురక్షితంగా భూమిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఈలోపు పారాచూట్ లైన్ చిక్కుకుపోయింది. ఆ సమయంలో బ్యాకప్ పారాచూట్ లేదు. పారాచూట్ తెరుచుకోవడంలో విఫలం కావడంతో విమానం 4.5 మైళ్లు (7.24 కిమీ) ఎత్తునుంచి భూమి మీద పడిపోయింది.
ది గార్డియన్ వెలువరించిన రిపోర్టు ప్రకారం ఈ ఘటనపై రష్యా స్పందిస్తూ ‘ప్రాథమిక నివేదికల ప్రకారం పారాచూట్‌లోని ప్రధాన భాగం ఏడు కిలోమీటర్ల ఎత్తులో తెరుచుకున్న సమయంలో పారాచూట్ పట్టీలు ముడుచుకుపోయాయి. ఇంతలో వ్యోమనౌక వేగంగా భూమిపై పడిపోయింది. ఈ దుర్ఘటన కొమరోవ్ మరణానికి దారితీసింది’ అని పేర్కొంది. సోయుజ్-1 మునుపటి రష్యన్ క్రాఫ్ట్ కంటే అధిక బరువు కలిగి ఉందని, ఇందులో సాధారణం కన్నా రక్షణ మార్జిన్లు తక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment