భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలాన్ని తాజాగా గుర్తించారు. ఇప్పటిదాకా భూమికి అతి సమీపంలో ఉన్న కృష్ణబిలం కంటే ఇది ఏకంగా మూడింతలు దగ్గరగా ఉంది! సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం భూమికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఒఫికస్ నక్షత్ర మండలంలో ఉంది.
పాలపుంతలో నిద్రాణంగా ఉన్న కృష్ణబిలాన్ని కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారి కూడా కావడం విశేషం. కృష్ణబిలాలు ఏర్పడే క్రమాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment