
ఎప్పుడో 50 వేల ఏళ్ల క్రితం కన్పించిన ఓ తోకచుక్క త్వరలో మళ్లీ మనల్ని పలకరించనుంది. ఫిబ్రవరి 1న భూమికి అత్యంత సమీపంగా, అంటే 2.6 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. జనవరి 26 నుంచి వారం పాటు మామూలు కంటికి కూడా కన్పిస్తుందని నాసా చెబుతోంది. అది ప్రస్తుతం మనకు 11.7 కోట్ల మైళ్ల దూరంలో ఉంది.
సి2022 ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్కను నాసా సైంటిస్టులు కెమెరాలో బంధించారు. అన్నట్టూ, భూమి మాదిరిగానే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుందట. 50 వేల ఏళ్లకు ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుందట! 2020 జూలైలోనూ ఇలాగే ఒక తోకచుక్క మనకు కన్పించేంత సమీపంగా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment