నల్లగొండ జిల్లా హుజూరాబాద్ మండలం శ్రీనగర్ కాలనీలో సహకార బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ వెంకటరెడ్డి మంగళవారం మధ్యాహ్నం అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు.
నల్లగొండ జిల్లా హుజూరాబాద్ మండలం శ్రీనగర్ కాలనీలో సహకార బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ వెంకటరెడ్డి మంగళవారం మధ్యాహ్నం అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన హఠాత్తుగా మృతిచెందడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.