సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్‌రెడ్డి. రాజకీయాల కోసం టీడీపీ నేతలు దిగజారిపోయారి ఎద్దేవా చేశారు. తన పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పమంటున్నామని ప్రశ్నించారు.
కాగా, కారుమూరి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు నోరు తెరిస్తే బూతులు తప్ప ఏం మాట్లాడటం లేదు. ఇలాంటి నీచ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు?. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో చెప్పాలి. మా ప్రభుత్వ పాలనలో మేం చేశామో మేం చెబుతాం. మీ నైతిక పొత్తుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేదు. పట్టాభి, అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టించడం చంద్రబాబు అలవాటే.
నోరు అదుపులో పెట్టుకొండి..
మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను. ఒళ్లు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొండి. మీ మాదిరిగా మేము మాట్లాడితే, ఒక్కరోజు కూడా మీరుండ లేరు. మాకు సంస్కారం ఉంది. అదే మాకు మా నాయకుడు నేర్పారు. మేము రాజకీయాల్లో ఫెయిర్‌గా ఉన్నాం. ఓడినా వెనక్కు తగ్గలేదు. ప్రజల్లో ఉన్నాం. అఖండ మెజారిటీతో గెల్చాం. మళ్లీ 2024లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కచ్చితంగా మళ్లీ ఘన విజయం సాధిస్తాం.
ప్రజలే బుద్ధి చెబుతారు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. విలువలు, విశ్వసనీయత, ప్రజలను నమ్ముకున్నారు. మీ మాదిరిగా పొత్తులు, అనైతిక రాజకీయాలు చేయబోం. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఏం చేసినా, ఎన్ని బూతులు తిట్టించినా మీ సంస్కారానికి వదిలేస్తున్నాం. మళ్లీ మా విజయాన్ని ఆపలేరు. అంతేకానీ, ఈ తరహాలో విమర్శలు, మీ అనుకూల పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటే, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. పాలిటిక్స్‌లో క్లియర్‌గా ఉండండి. ఓపెన్‌గా రండి అంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment