లోక్‌సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పాప వెంకటరెడ్డితో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఆదివారం వారిని లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్రకార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కండువ కప్పి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
నగరానికి చెందిన ఎ. ప్రతాప్, కార్తీక్, శ్రీనివాస్, వెంకన్న, సురేష్, నవీన్, జగదీష్, క్రిష్ణలతో పాటు మరో 50 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వెంకట రమణ, సంయుక్త కార్యదర్శి దుర్భాక గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.