‘గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని గుంటూరు జిల్లా పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి వైఎస్ జగన్‌ను కోరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం మేడికొండూరులో పలువురు పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు జననేతను కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల పంచాయతీల్లో పని చేస్తున్న ఫుల్ టైమ్, పార్ట్‌టైమ్, ఎన్‌ఎంఆర్ సిబ్బంది రెగ్యులర్ కాకుండా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే టెండర్ విధానాన్ని రద్దు చేసి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పంచాయతీ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగుల మన్ననలు పొందారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment