panchayat employees
-
పంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెలనెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.116 కోట్లు జీతాలుగా చెల్లించాల్సి ఉంది. ఈ జీతాల చెల్లింపులో ఆలస్యం జరగకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్ చానల్ ద్వారా వీరికి జీతాలు చెల్లించాలని సూచించారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలిమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇచ్చే బిల్లులను సకాలంలో చెల్లించాలని సీఎం ఆదేశించారు. గతేడాది ఏప్రిల్ నుంచి దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని.. వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను త్వరగా చెల్లించాలని అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. సమీక్షలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘పంచాయతీ కార్మికులతో చర్చలు జరపండి’
సాక్షి, హైదరాబాద్: విధులు బహిష్కరించి పక్షం రోజులుగా ఆందోళన చేస్తోన్న పంచాయతీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ ఎస్కే జోషిలను కలసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆందోళన చేస్తే శాశ్వతంగా ఉద్యో గం నుంచి తొలగిస్తామని బెదిరించడం అన్యాయమన్నారు. ఆందోళన చేస్తోన్న ఉద్యోగులతో సామరస్యంగా చర్చలు జరపాలని, బెదిరింపులకు పాల్పడితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఒడిశా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును అనుసరించాలని సూచించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన జగ్గంపేట పంచాయితీ సిబ్బంది
-
వైఎస్ జగన్‌ను కలిసిన పంచాయతీ కార్మికులు
-
పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
‘గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని గుంటూరు జిల్లా పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి వైఎస్ జగన్‌ను కోరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం మేడికొండూరులో పలువురు పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు జననేతను కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల పంచాయతీల్లో పని చేస్తున్న ఫుల్ టైమ్, పార్ట్‌టైమ్, ఎన్ఎంఆర్ సిబ్బంది రెగ్యులర్ కాకుండా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే టెండర్ విధానాన్ని రద్దు చేసి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పంచాయతీ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగుల మన్ననలు పొందారని గుర్తు చేశారు. -
'పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తాం'
హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శులకు త్వరలో పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలు పూర్తయినందున ఇకపై పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) రూపొందించిన నూతన సంవత్సరం డైరీని మంత్రి కేటీఆర్ మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు కీలక భూమిక పోషిస్తున్నారని అభినందించారు.