హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శులకు త్వరలో పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలు పూర్తయినందున ఇకపై పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్‌ఏ) రూపొందించిన నూతన సంవత్సరం డైరీని మంత్రి కేటీఆర్ మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు కీలక భూమిక పోషిస్తున్నారని అభినందించారు.