బీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో అన్నం గిన్నె మోసిన ఎస్సై  | SI photo went viral on social media | Sakshi

బీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో అన్నం గిన్నె మోసిన ఎస్సై 

Mar 30 2023 3:25 AM | Updated on Mar 30 2023 3:25 AM

 SI photo went viral on social media - Sakshi

హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సై వెంకటరెడ్డి అన్నం గిన్నె మోస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవు తోంది. హుజూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వెంకటరెడ్డి బందోబస్తు కోసం వెళ్లారు. అక్కడ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి అన్నం గిన్నెను మోయడం చర్చనీయాంశమైంది.

‘అక్కడ చాలామంది కార్యకర్తలు ఉన్నా కూడా ఓ ఎస్సై ఇలా ప్రవర్తించడం విస్మయానికి గురిచేసిందని, హుజూర్‌నగర్‌లో పోలీసులు చివరికి బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌లలో అన్నం గిన్నెలు మోసే స్థితికి దిగజారారు, ఇంకా ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందా’అంటూ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సామాజిక మాధ్యమాలలో కామెంట్‌ పోస్టు చేశారు. ఈ విషయమై సదరు ఎస్సై వివరణ ఇస్తూ..భోజనం కోసం కార్యకర్తల మధ్య గొడవ జరుగుతుండగా వారిని అదుపు చేయడం కోసమే అన్నం గిన్నెను పక్కకు జరిపామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement