జగన్ వెంటే జనం | Public support in ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

జగన్ వెంటే జనం

Published Sun, Feb 2 2014 3:21 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Public support in ys jagan mohan reddy

సాక్షి, కాకినాడ :బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే జనం ఉన్నారని, రోజురోజుకు ఆయనకు పెరుగుతున్న ఆదరణే దీనికి నిదర్శనమని పార్టీ నేతలు పేర్కొన్నారు. గడపగడపకు వైఎస్సార్ సీపీ సమైక్య నినాద పాదయాత్రలు జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్నాయి. ఈకార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలకు జనం అడుగడుగునా మంగళ హారతులు పడుతున్నారు.
 
 విజయదుర్గాపీఠంలో పూజలు
 మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ గిరిజాల వెంకట స్వామినాయుడు శనివారం రాయవరం మండలం వెదురుపాక నుంచి గడపగడపకు వైఎస్సార్ సీపీకీ శ్రీకారం చుట్టారు. తొలుత విజయదుర్గా పీఠంలో ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు అందుకొన్నారు. అనంతరం గ్రామంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి మాట్లాడుతూ జగన్ పోరాటపటిమ, నాయకత్వ స్ఫూర్తిని చూసి రాష్ర్ట పగ్గాలు అప్పగించేందుకు రాష్ర్ట ప్రజలు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారన్నారు. కో ఆర్డినేటర్ స్వామినాయుడు మాట్లాడుతూ జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కొన్ని దుష్టశక్తులు దుష్ర్పచారం చేస్తున్నాయన్నారు. 
 
 వాటికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 2014 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పార్టీ వాణిజ్య, కిసాన్ విభాగాల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, రాయవరం మండల కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ కొవ్వాడలో పార్టీ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాసగోపాలకృష్ణ గడపగడపకు వైఎస్సార్ సీపీ నిర్వహించారు. అదే విధంగా జగ్గంపేట మండలం భావవరం గ్రామంలో పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్‌కుమార్ గడప గడపకు వైఎస్సార్‌సీపీ నిర్వహించారు. ఇంటిం టికి తిరిగి పార్టీ విధివిధానాలను ప్రజలకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement