
సాక్షి, తాడేపల్లి: మద్యంపై చంద్రబాబు నాయుడు తప్పుడు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు.అవాస్తవ ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్తె ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఆదివారం మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్రానికి ఆదాయం రాకూడదన్న ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. వైస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క లిక్కర్ బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బ్రాండ్‌లన్ని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవే అని చెప్పారు. మద్యం కంపెనీలన్నీ టీడీపీ నాయకులవే అని దుయ్యబట్టారు.