Karumuri
-
చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: ఎమ్మెల్యే వాసుబాబు
-
ఏయ్.. మిమ్మల్ని కూడా ఎర్రబుక్కులో చేరుస్తా..
-
అంబెడ్కర్ కలను నిజం చేసిన నాయకుడు సీఎం జగన్: మంత్రి కారుమూరి
-
ఎన్టీఆర్ నుంచి పార్టీ ని లాక్కున్న చరిత్ర బాబుది : కారుమూరి
-
మద్యంపై చంద్రబాబు తప్పుడు విమర్శలు: కారుమూరి వెంకటరెడ్డి
సాక్షి, తాడేపల్లి: మద్యంపై చంద్రబాబు నాయుడు తప్పుడు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు.అవాస్తవ ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్తె ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఆదివారం మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్రానికి ఆదాయం రాకూడదన్న ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క లిక్కర్ బ్రాండ్కు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బ్రాండ్లన్ని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవే అని చెప్పారు. మద్యం కంపెనీలన్నీ టీడీపీ నాయకులవే అని దుయ్యబట్టారు. -
చరిత్రహీనులుగా టీడీపీ, బీజేపీ నేతలు
తణుకు : ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కారుమూరి మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. రెండున్నరేళ్లు ప్రజలను మభ్య పెట్టి దోబూచులాడుతూ చివరికి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రత్యేక ఆర్థిక సాయం మాత్రం ప్రకటించడం దారుణమన్నారు. ఐదు కాదు పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు, పది కాదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు నేడు తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో తాను బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. 22న ఏలూరులో యువభేరి నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, సమన్వయకర్త కలిశెట్టి శ్రీనివాసు, నాయకులు నార్గన సత్యనారాయణ, పెన్మత్స రామరాజు, కౌరు వెంకటేశ్వర్లు, బుద్ధరాతి భరణీప్రసాద్, హబీబుద్దీన్, దాసి రత్నరాజు, వి.సీతారామ్ పాల్గొన్నారు. -
ప్రజలను మోసగిస్తూనే ఉన్న సీఎం చంద్రబాబు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి విమర్శ తణుకు : రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించి మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు విమర్శించారు. ఆయన ప్రణబ్ కమిటీకి చంద్రబాబు లేఖ ఇచ్చి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీల మేరుకు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు రావని, ప్రత్యేక హోదాతోనే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ వారిని మోసం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పట్టిసీమ పథకం పూర్తి కాకుండా జాతికి అంకితం చేసిన చంద్రబాబు రైతులను మోసగిచారని పేర్కొన్నారు. కనీసం కాలువలు కూడా పూర్తి కాకుండానే ఆయన హడావుడి చేస్తుడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుపై చూపిస్తున్న శ్రద్ధను పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు చూపడం లేదో ప్రజలకు అర్థమవుతోందన్నారు. కేవలం కమీషన్ల కోసమే పట్టిసీమ, రాజధాని నిర్మాణాల చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేస్తున్నారని కారుమూరి విమర్శించారు.