ఆ ఊరిలో మంచి పోలీస్‌.. చెడ్డ పోలీస్‌! | Home Guard Molested A Minor Girl In Machilipatnam | Sakshi
Sakshi News home page

ఆ ఊరిలో మంచి పోలీస్‌.. చెడ్డ పోలీస్‌!

Published Sat, Feb 22 2020 5:44 PM | Last Updated on Sat, Feb 22 2020 7:21 PM

Home Guard Molested A Minor Girl In Machilipatnam - Sakshi

జిల్లాలోని మచిలీపట్నంలో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో ఒక పోలీసు ఔదార్యాన్ని ప్రదర్శించగా మరో పోలీసు కీచకుడిగా మారాడు.

సాక్షి, కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో ఒక పోలీసు ఔదార్యాన్ని ప్రదర్శించగా మరో పోలీసు కీచకుడిగా మారాడు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ సీఐ ఆపదలో ఉన్న ఓ గర్భిణి (మైనర్‌ బాలిక) పట్ల పెద్ద మనసు చాటారు. పోక్సో కేసులో బాధితురాలిగా ఉన్న గర్భిణికి సీఐ మోర్ల వెంకటరమణ రక్తదానం చేశారు. ఆయనను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు అభినందించారు.

ఇక ఇదే మచిలీపట్నంలో ఫణీంద్ర అనే హోంగార్డు ప్రేమ పేరుతో ఓ బాలికను మోసం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుశ్చర్యకు పాల్పడింది మహిళా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన హోంగార్డే కావడం గమనార్హం. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. హోంగార్డు ఫణీంద్రను అరెస్టు చేసి విచారిస్తున్నామని అడిషనల్‌ ఎస్పీ సత్తిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement