
సాక్షి, విజయవాడ: హోంగార్డ్ వినోద్ భార్య మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్యతో గొడవల వల్లే వినోద్ కాల్పులు జరిపినట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు మీడియాకు వెల్లడించారు. గత కొంతకాలంగా హోంగార్డు వినోద్, భార్య రత్నప్రభకు విభేదాలు నెలకొన్నాయి.
నాలుగు నెలలుగా భార్య నగలు తాకట్టు పెట్టిన విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వివాదాలు తీవ్రస్థాయికి వెళ్లడంతో భార్యను గన్‌తో కాల్చి చంపాడని.. కాల్పుల్లో రత్నప్రభ అక్కడికక్కడే చనిపోయిందని ఏసీపీ తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా.. గన్ మిస్ ఫైర్ అయిందని హోంగార్డ్ వినోద్ చెప్పాడని ఏసీపీ హనుమంతరావు వివరించారు. హోంగార్డుపై కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.
చదవండి:
అద్దె కోసం వచ్చామంటూ 12 సవర్ల బంగారం దోచేశారు
పాజిటివ్ వచ్చింది బాబూ; పకోడీలు వేసి వస్తా!
Comments
Please login to add a commentAdd a comment