
హోంగార్డు శ్రీనివాసరావు (ఫైల్)
ప్రకాశం, చీరాల రూరల్: పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఈపురుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో శుక్రవారం రాత్రి జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాసరావు (42) ఈపురుపాలెం పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తుంటాడు. విధుల పట్ల అంకిత భావంతో ఉండే అతడు ఏం జరిగిందో తెలియదుగానీ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. శ్రీనివాసరావు కలెక్టర్ చేతుల మీదుగా 2018లో ఉత్తమ హోంగార్డు అవార్డు కూడా అందుకున్నాడు. మృతుడికి భార్య ఉమ, కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హోంగార్డు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment