
కిరోసిన్ తాగిన హోంగార్డు..
మెదక్ జిల్లాలో ఓ హోంగార్డు కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
మెదక్ : మెదక్ జిల్లా సిద్ధిపేటలో హోంగార్డు అన్వర్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. శుక్రవారం రాత్రి అతడు కిరోసిన్ తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే స్పందించి... అతడిని సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అన్వర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అన్వర్ ఆత్మహత్యయత్నంపై సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్లాల్ అహ్మద్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని అతడిని పరామర్శించారు. ట్రాఫిక్ ఎస్ఐ వేధింపుల కారణంగానే అన్వర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.