హైదరాబాద్: నగరంలోని తిలక్‌నగర్‌లో హోంగార్డులు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. స్థానిక హోంగార్డుల కార్యాలయంలో ఆ సంఘం చైర్మన్ సకినాల నారాయణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేపట్టిన ఈ ఆందోళనలో సుమారు 200 మంది హోంగార్డులు పాల్గొన్నారు.