భార్యను దారుణంగా హతమార్చిన హోంగార్డు | Home guard brutally murdered his wife | Sakshi
Sakshi News home page

భార్యను దారుణంగా హతమార్చిన హోంగార్డు

Published Sat, May 30 2015 7:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

Home guard brutally murdered his wife

హైదరాబాద్ :  హోంగార్డు అతడి భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ప్రవీందర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కార్ఖానా పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న బిన్ని ఆంజనేయులు మల్లాపూర్ నర్సింహనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడు భార్య హేమలత(28)తో తరచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆంజనేయులు హేమలత తలను గోడకేసి గట్టిగా బాది , అనంతరం మెడపై కాలితో తొక్కి హత్య చేశారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి కిష్టమ్మ నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసమే తన కూతురిని వేధించి హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృత దేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement