కుటుంబ కలహాలతో ఓ హోంగార్డు భార్యను హతమార్చాడు.
కుటుంబ కలహాలే కారణం
నాచారం (హైదరాబాద్): కుటుంబ కలహాలతో ఓ హోంగార్డు భార్యను హతమార్చాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నగరంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆంజనేయులు నాచారం ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆంజనేయులు అతడి భార్య మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఆవేశంలో ఆంజనేయులు భార్యను హత్య చేశాడు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.