సీఎం పెద్దమనసుతో ఆలోచించాలి
‘హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి’
సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించాలని సీఎం కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేస్తున్న హోంగార్డులను ఉద్యోగాల నుంచి తొల గించాలని చూస్తే మాత్రం అది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు అవుతుందన్నారు.
ఈ మేరకు కేసీఆర్కు సోమవారం లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా.. హామీలు పూర్తిగా అమలుకాక హోంగార్డులు నిరాశ, నిస్పృహలకులోనై ఆందోళనకు దిగారన్నారు. పోలీసులతో సమానంగా వారు విధులు నిర్వహిస్తున్నా నెల జీతం బదులు దినసరి వేతనం ఇస్తున్నార న్నారు.