హోంగార్డ్ రవీందర్ మృతిపై కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్‌ | Case Filed On Home Guard Ravindhar | Sakshi
Sakshi News home page

హోంగార్డ్ రవీందర్ మృతిపై కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్‌

Published Fri, Sep 8 2023 2:52 PM | Last Updated on Fri, Sep 8 2023 3:21 PM

Case Filed On Home Guard Ravindhar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోమ్ గార్డ్ రవీందర్ మృతి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 306 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో ఏఎస్‌ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పేర్లను నిందితులుగా చేర్చారు. జీతం గురించి అడిగితే ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ అవమానించారని మృతుడు హోమ్ గార్డ్ రవీందర్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు చెప్పారు.

కాగా.. హోంగార్డు అంశం తెలంగాణ హైకోర్టుకు చేరింది.హోంగార్డ్ రవీందర్ చావుకు కారణమైన అధికారులను శిక్షించాలని పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను హోమ్ గార్డ్ JAC దాఖలు చేసింది.హోంగార్డ్ రవీందర్ చావుతో జేఏసీ సభ్యులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అధ్యక్షుడు నారాయణను అరెస్ట్ చేశారని ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియదని పిటిషన్‌లో జేఏసీ పేర్కొంది.హోంగార్డ్ రవీందర్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. 

ఇదీ చదవండి: నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే:హోంగార్డ్‌ రవీందర్‌ భార్య సంచలన ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement