File information report
-
హోంగార్డ్ రవీందర్ మృతిపై కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: హోమ్ గార్డ్ రవీందర్ మృతి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 306 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో ఏఎస్ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పేర్లను నిందితులుగా చేర్చారు. జీతం గురించి అడిగితే ఏఎస్ఐ, కానిస్టేబుల్ అవమానించారని మృతుడు హోమ్ గార్డ్ రవీందర్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు చెప్పారు. కాగా.. హోంగార్డు అంశం తెలంగాణ హైకోర్టుకు చేరింది.హోంగార్డ్ రవీందర్ చావుకు కారణమైన అధికారులను శిక్షించాలని పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను హోమ్ గార్డ్ JAC దాఖలు చేసింది.హోంగార్డ్ రవీందర్ చావుతో జేఏసీ సభ్యులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అధ్యక్షుడు నారాయణను అరెస్ట్ చేశారని ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియదని పిటిషన్లో జేఏసీ పేర్కొంది.హోంగార్డ్ రవీందర్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇదీ చదవండి: నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే:హోంగార్డ్ రవీందర్ భార్య సంచలన ఆరోపణలు -
కోర్టు ఆదేశిస్తేనే ఎఫ్ఐఆర్ నమోదా..?
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం ఎస్సైకు రూ. 15 వేలు జరిమానా సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన (కాగ్నిజబుల్) నేరాల్లోనూ బాధితుల ఫిర్యాదుతో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని మండిపడింది. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అనేక పర్యాయాలు డీజీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు అసహ్యం కలిగిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదు చేసినా 30 రోజులపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైదరాబాద్‌లోని నారాయణగూడ పీఎస్ ఎస్సై తీరును తప్పుబట్టింది. ఇందుకుగాను ఆ ఎస్సై రోజుకు రూ. 500 చొప్పున మొత్తం రూ. 15 వేలు సొంత డబ్బు బాధితునికి చెల్లించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తీర్పునిచ్చారు. డెల్టా క్యాబ్‌కు చెందిన సాజిద్ హుస్సేన్ తనను మోసం చేశాడని ఏవీ సంతోష్‌కుమార్ 2013, నవంబర్ 11న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో అదే నెల 16న మరోసారి పోస్టు ద్వారా ఫిర్యాదు పంపారు. దీనిపైనా పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో సంతోష్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.