హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హోంగార్డుపై దాడికి పాల్పడింది సినీనటి సౌమ్యజాను గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై జాగ్వార్ కారులో రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ మహిళ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడిపై దాడికి పాల్పడింది.
పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా సంఘటనకు కారణమైన మహిళను సినీనటి సౌమ్య జానుగా గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా అందుబాటులో లేదని తెలిపారు. ఆమె సెల్‌ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయన్నారు. ఆమెపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా సౌమ్యజాను సంఘటన అనంతరం ఓ చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో తాను అత్యవసర పనిపై వెళుతూ రాంగ్‌రూట్‌లో వచి్చనట్లు అంగీకరించారు. అయితే తనను అక్కడ విధుల్లో ఉన్న పోలీసు బూతులు తిట్టినందునే తాను ఎదురుదాడి చేయాల్సి వచి్చందన్నారు. తాను అతని లైఫ్ జాకెట్ చించలేదని తెలిపారు. తాను కూడా హోంగార్డుపై ఫిర్యాదు చేస్తానన్నారు. తనను పోలీసులు విచారణకు పిలవలేదని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment