హోంగార్డులు బలవన్మరణాలకు పాల్పడవద్దని వారికి బీజేపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు.
'హోంగార్డులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు'
Published Tue, Sep 19 2017 12:13 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
కామారెడ్డి: హోంగార్డులు బలవన్మరణాలకు పాల్పడవద్దని వారికి బీజేపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు జిల్లాలోని ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు శివ అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డులను పర్మినెంట్ చేసేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. దీనికి సంబంధించి ఇటీవల నగరంలోని బషీర్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలో పాల్గొంటే పోలీసులు తనను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
Advertisement
Advertisement