ఇందిరా పార్క్ వద్ద హోంగార్డుల ఆందోళన
హైదరాబాద్: హోం గార్డులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇందిరా పార్క్ వద్ద హోంగార్డులు గురువారం ఆందోళనకు దిగారు. కానిస్టేబుళ్లతో పాటు సమానంగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారమవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం హోం గార్డులను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. లేకపోతే తమ ఆందోళలను భవిష్యత్ లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.