
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న హోంగార్డులకు రోజువారీ జీతం 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు వీరికి రోజుకు రూ.675 వేతనం వచ్చేది. తాజా పెంపు నేపథ్యంలో ఇకపై రోజుకు రూ.877 జీతంగా రానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 20 వేల మందికిపైగా హోంగార్డులకు లబ్ధి చేకూరనుంది.
(చదవండి: ఎంఎంటీఎస్ రైలులో కత్తితో హల్‌చల్)
Comments
Please login to add a commentAdd a comment